- అమ్మవారికి వడి బియ్యం సమర్పించిన భక్తులు..
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట డాక్ (ఐబి) బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శుక్రవారం పురస్కరించుకొని భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవతకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి భక్తులు వడి బియ్యం పోసి, నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తూ శ్రీ బంగారు మైసమ్మ దేవత భక్తుల కొంగు బంగారంగా విరాజుల్లుతుంది. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
