అనన్య న్యూస్, జడ్చర్ల: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి.. సంరక్షించుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు మానవాళి మనగడకు మొక్కలు ఎంతో దోహదపడతాయని డి.ఐ.జి ఎల్ ఎస్ చౌహన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం జడ్చర్ల డిటిసి కేంద్రంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో డిఐజి పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం మాట్లాడుతూ కాలుష్య రహిత సమాజం కొరకు ప్రతి ఒక్కరూ మొక్కలను సంరక్షించుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు మొక్కలు నాటడమే కాక వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలో మొత్తం 540 మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కే. నరసింహ, అదనపు ఎస్పి రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు మహేష్, రమణారెడ్డి, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.