- ఈనెల 25న ఆదివారం శ్రీ బంగారు మైసమ్మ బోనాలు..
అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట ఐబి బంగ్లా సమీపంలో 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న శ్రీ బంగారు మైసమ్మ బోనాల నిర్వహణ (ఉత్సవ) కమిటీని ఎన్నుకున్నారు.
ఆదివారం దేవాలయ ఆవరణలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బోనాల నిర్వహణ (ఉత్సవ) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మిద్దె నాగరాజు, ఉపాధ్యక్షులుగా గుండు చంద్ర శేఖర్, ప్రధాన కార్యదర్శిగా బుక్క శివ కుమార్, సహాయ కార్యదర్శిగా చిక్క చంద్ర శేఖర్, కోశాధికారిగా జి. విజయ కుమార్, సహాయ కోశాధికారిగా గుండు శ్రీశైలం, సభ్యులుగా దండు వెంకట్ రాములు, ఉల్లి యాదగిరి, పిట్టల శ్రీనివాసులు, వి. శ్రీధర్, గోనెల నరేందర్, పండ్ల దేవరాజు, వడ్లని నాగరాజు, బుక్క రమేష్, వెంకటేష్, గోనెల కుమార్, దండు కృష్ణ, శివ కుమార్, యాదయ్య, జంగయ్య, వెంకటేష్ లను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25న ఆదివారం కావేరమ్మపేట శ్రీ బంగారు మైసమ్మ దేవతకు వైభవంగా నిర్వహించే బోనాల పండుగ మహోత్సవంలో భక్తులు, ప్రజలు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ పురాతనమైన శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు దేవాలయ నిర్మాణానికి, అభివృద్ధికి సహకరించిన దాతలకు, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని, అమ్మవారి కృప వారికి లభించాలని కోరుతున్నామని అన్నారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న దేవాలయ నిర్మాణం పూర్తి కావచ్చిందని ఇంకా కొన్ని నిర్మాణ పనులు ఉన్నాయని అందుకు ప్రతి ఒక్కరూ సహాయాన్ని అందించి, దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
దాతలు దేవాలయ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 9951593558 ద్వారా భక్తులు, ప్రజలు తమ అమూల్యమైన ఆర్థిక సహాయాన్ని అందించి దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు..
