అనన్య న్యూస్, జడ్చర్ల: బీఆర్ఎస్ ఖాతాలోకి పెద్దాయిపల్లి గ్రామం చేరిందనీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బాలానగర్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య అతని అనుచరులతో సహా 100 మందికి పైగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతనంగా చేరిన సభ్యులను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పెద్దాయపల్లి నాయకులంతా బిఆర్ఎస్ పార్టీ కే ఓటు వేస్తామని, అభివృద్ధి సంక్షేమం కల్పిస్తున్న పార్టీకే మద్దతుగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏమీ లేదని, కనీసం తాగునీళ్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని అన్నారు. ఇంటింటికి నల్ల ద్వారా తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, నేడు మన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని, కష్టపడి పార్టీ అభ్యున్నతికి మరింత కృషి చేయాలన్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.