అనన్య న్యూస్, జడ్చర్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చంద్ర గార్డెన్ లో జడ్చర్ల మండలం, మున్సిపాలిటీ పరిధిలోని 150 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహాయంతో ఎంతోమంది పేద కుటుంబాలకు పెళ్లిళ్ల భారం తగ్గిందని, ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ముందుగా జడ్చర్ల మున్సిపాలిటీ 10వ వార్డు పోచమ్మ గుడి దగ్గర నూతన సిసి రోడ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
అనంతరం మూడా డైరెక్టర్ శ్రీకాంత్ తండ్రి శివకుమార్ దశదిన కర్మకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, శ్రీకాంత్ కు మనోధైర్యం తెలిపారు.
కార్యక్రమాలలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తాహాసిల్దార్ శ్రీనివాసులు, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజు, లత, శశికిరణ్, మహేష్, సతీష్, నాయకులు ఏం ఏ మాలిక్ షాకీర్, దోరేపల్లి రవీందర్, రామ్మోహన్, జంగయ్య, కాశీ విశ్వనాథం, మురళి తదితరులు పాల్గొన్నారు.