అనన్య న్యూస్, జడ్చర్ల: కూరగాయల షాపులో టమాటాలు విక్రయిస్తున్న యజమానికి బొజ్జ గణపయ్య ఆకారాన్ని పోలిన టమాటను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోనీ బుక్క రమేష్ కూరగాయల షాపులో టమాటాలను విక్రయిస్తుండగా అందులో బొజ్జ గణపయ్య ఆకారం పోలిన టమాట లభించడంతో ఆనందం వ్యక్తం చేస్తూ బొజ్జ గణపయ్య టమాటను తన షాపులోనీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించాడు. ఇంకా వారం రోజుల్లో వినాయక చవితి ఉండగ టమాట బొజ్జ గణపయ్య లభించడం దైవాజ్ఞ అని బుక్క రమేష్ ఆనందం వ్యక్తం చేశాడు.