- ఆగస్టు నెలాఖరు లోపే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ.
- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: పేదింటి ఆడబిడ్డ పెళ్లికి గతంలో ఏ ప్రభుత్వమైనా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో (42) మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందిన, వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందినవారు గ్రామాల్లో చర్చ జరపాలని, మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, ముడా డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు నెలాఖరులోగా డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
జడ్చర్ల మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించి పూర్తి కార్యాచరణ, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుపుతున్నామని, దాదాపు 800 ఇండ్లకు సంబంధించి పూర్తిగా నిరుపేదలు, ఇల్లులేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేస్తామని స్పష్టం చేశారు. అధిక శ్రావణ మాసం కావున ఆగస్టు నెలాఖరులోగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రకటించారు.