అనన్య న్యూస్, నవాబుపేట: రాష్ట్రంతో పాటు మన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరపాలని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. నవాబుపేట మండలం కూచురు గ్రామంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంగళవారం పర్యటించారు.
గ్రామంలో అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కూచురులో గ్రామ పంచాయతీ భవనం, మహిళ సమాఖ్య భవనం, ముదిరాజ్ సంఘ భవనాలను ప్రారంభించారు. అనంతరం సీసీ రోడ్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు గ్రామానికి చెందిన లింగయ్య కుటుంబానికి గృహాలక్ష్మి పధకంలో ఇల్లు మంజూరు కాగా ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక గ్రామాల రూపురేఖలు మారాయని, ప్రతి గ్రామానికి రోడ్ల కనెక్టివిటీ పెరిగిందన్నారు. గ్రామాల్లో తాగు నీటికి ఇబ్బందులు తొలిగాయని, కరెంట్ కష్టాలు తొలగాయన్నారు. పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదికలతో గ్రామాలకు మహర్థశ పట్టిందన్నారు. యన్మంగండ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.