- విజయోత్సవ సభను తలపించిన యువజన సదస్సు..
- పనిచేసే ప్రభుత్వానికే మద్దతుగా నిలవండి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి..
అనన్య న్యూస్, జడ్చర్ల: అబ్ కి బార్ కిసాన్ సర్కార్ ఖాయమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల నియోజక వర్గ యువజన సదస్సు ధూంధాంగా సాగింది. వేలాది మంది యువకులు తరలి రావడంతో సభ ప్రాంగణం మొత్తం సందడిగా మారింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పార్టీ యువజన సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో యువ నాయకులు భారీ స్థాయిలో తరలివచ్చారు. వివిధ మండలాల నుంచి కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లలో దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేశారాని, దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉన్నదని అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్ గా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాక ముందు తాగు నీటికి, కరెంటుకు నానా అవస్థలు పడే వారమని, ఆసరా పెన్షన్ 200 రూపాయలు సరిపోక వృద్ధులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. మరిప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయని ఒకసారి గమనించాలని తెలిపారు.

ప్రతి ఊరికి మిషన్ భగీరథ ట్యాంక్ వచ్చిందని, ప్రతి ఇంటికి నల్ల నీరు చేరాయని, గుంట పొలం ఉన్న రైతుకు కూడా రైతుబంధు వస్తుందని ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్నాయని అన్నారు. ఈనెల 16న సీఎం కేసీఆర్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మొదటి పంపును ప్రారంభించడానికి నార్లాపూర్ వస్తున్నారని, ప్రతి గ్రామం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని కోరారు. ఇన్ని మంచి పనులు ఇంత అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికే మద్దతుగా నిలవాలని, సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ వింగ్ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.