- పండుగల సాయన్న జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి.
- కావేరమ్మపేట ముదిరాజ్ సంఘం..
అనన్య న్యూస్, జడ్చర్ల: అణగారిన వర్గాల ఆశాజ్యోతి, పాలమూరు పులిబిడ్డ పండుగల సాయన్న అని కావేరమ్మ పేట ముదిరాజ్ సంఘం నాయకులు అన్నారు. తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న 134వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కావేరమ్మపేట చౌరస్తాలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగల సాయన్న చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న పేదల ఆకలి తీర్చిన మహనీయుడని, పేదల కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధుడని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పండుగల సాయన్న ఎనలేని పోరాటాలని చేశారని అలాంటి మహనీయుని ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు.
తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న జీవిత చరిత్రను పాఠశాల పాఠ్యాంశాలలో చేర్చాలని, ప్రతి గ్రామం, మండల కేంద్రాలలో సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.