అనన్య న్యూస్, జడ్చర్ల: సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లు అన్నారు. బుధవారం మధ్యాహ్నం జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే మొదటి బహిరంగ సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జడ్చర్లలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Jadcherla: సీఎం కెసిఆర్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం..
RELATED ARTICLES