అనన్య న్యూస్, జడ్చర్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఏఐసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి అన్నారు. గురువారం జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, జడ్చర్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ కర్ణాటక, తెలంగాణ నేతలు అస్లం, షాయాజ్, జహీర్ అక్తర్, గౌస్ రబ్బాని, మీనాజ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Jadcherla: మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి: ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి..
RELATED ARTICLES