- జడ్చర్లలో బిఆర్ఎస్ పార్టీనీ అధిక మెజారిటీతో గెలిపించాలి..
అనన్య న్యూస్, జడ్చర్ల: ఎన్నికలవేళ ఓట్ల కోసం మీ ఇండ్ల ముందుకు అందరూ వస్తారు. కాంగ్రెస్, బిజెపి మాయ మాటలు నమ్మి మోసపోతే మళ్ళీ గోసపడతామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం బాలానగర్ మండలం హేమాజీపూర్ లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు అందరికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జడ్చర్లలో బిఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీజేపోళ్లు గ్రామాల్లో తిరుగుతూ తమ ఉనికి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరు ఎన్ని మాయ మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలు దీవించడానికి సిద్దంగా ఉన్నారని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడాననికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.
పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల తమ కుటుంబాలకి రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, వృద్దులకి అసరా పెన్షన్ లు వస్తున్నాయన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కెసీఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానికి మా గ్రామ ప్రజలందరూ పూర్తి మద్దతుగా ఉంటామని వెల్లడించారు.