అనన్య న్యూస్, జడ్చర్ల: బిఆర్ఎస్ హయాంలోని గ్రామాల రూపురేఖలు మారాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు ఆదివారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పనిచేసే పార్టీ గెలుపునకు కృషి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ గత పదేళ్లలో మసిగుండ్లపల్లి గ్రామం చాలా మారిందని రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుతో గ్రామం అభివృద్ధి చెందిందని తమ గ్రామంతో పాటు, నియోజకవర్గం కూడ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇంతటి అభివృద్ధి మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని బిఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు. జడ్చర్ల ఎమ్మెల్యేగా లక్ష్మారెడ్డికి లక్ష మెజార్టీ అందించే దిశగా ప్రతి ఒక్కరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ లో చేరిన ఎస్ఎఫ్ఐ ముఖ్య నాయకులు:
జడ్చర్ల మున్సిపాలిటీ పాత బజారుకు చెందిన 50 మంది ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారికి పార్టీ మేనిఫెస్టో పై అవగాహన కల్పించి, బిఆర్ఎస్ లక్ష మెజారిటీ సాధించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.