అనన్య న్యూస్, జడ్చర్ల: దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట గ్రామ చావిడి దగ్గర ఏర్పాటు చేసిన దుర్గామాత ఆదివారం మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకరణలో పూజలు అందుకుంది.

బాల త్రిపుర సుందరిగా శ్రీ బంగారు మైసమ్మ:

దేవి శరన్నవ రాత్రులలో భాగంగా కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి సమీపంలో ఉన్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయంలో శ్రీ బంగారు మైసమ్మ దేవత ఆదివారం బాలా త్రిపుర సుందరి అలంకారణలో పూజలు అందుకుంది.