అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మబావి గడ్డ సమీపంలో వంశి హాస్పిటల్ వెనుక భాగంలో ఎర్రగుట్ట దగ్గర నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పలు కాలనీల ప్రజలు ఆక్రమించేందుకు సోమవారం యత్నించారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండ్లకు ప్రభుత్వ అధికారులు వేసిన తాళాలను పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు డబుల్ ఇండ్ల దగ్గరకి చేరుకొని విషయాన్ని ఆరా తీసి ప్రజలను అక్కడి నుంచి పంపించారు. ప్రజలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గరకి రెచ్చగొట్టి పంపించింది ఎవరనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Jadcherla: డబుల్ ఇండ్లను ఆక్రమించేందుకు యత్నం..
RELATED ARTICLES