అనన్య న్యూస్, జడ్చర్ల: జడ్చర్ల అభివృద్ధికి మీతో కలిసి నడుస్తామని సిపిఐ నాయకులు జడ్చర్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మారెడ్డికి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన సిపిఐ నాయకులు లక్ష్మారెడ్డి వెంటే ఉంటా మంటూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కమ్యూనిస్ట్ పార్టీ జడ్చర్ల పట్టణ కార్యదర్శి ఎస్.కె.ముజీబ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు మహమూద్ ఖాన్, షబ్బీర్, ఖలీం, గౌస్, ఖలేద్, అజీమ్, మేరాజ్ లతో పాటు 40 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వారందరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత పది ఏళ్లలో జడ్చర్ల ఎంతో అభివృద్ధి చెందిందని జడ్చర్ల అభివృద్ధిలో తామంతా భాగస్వాములు అయ్యేందుకే లక్ష్మారెడ్డి వెంట నడుస్తామని అన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
Jadcherla: జడ్చర్ల అభివృద్ధికి కలిసి నడుస్తాం..
RELATED ARTICLES