అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 1వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు గుండు చంద్రమౌళి, 11వ వార్డుకు చెందిన బిఆర్ఎస్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు జగదీశ్వర చారిలతో పాటు వారి మిత్రులు సుందర్ రాజ్, కావేటి శేఖర్, యాదయ్య యాదవ్ లు గురువారం టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనంపల్లి అనిరుద్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనిరుద్ రెడ్డి నూతనంగా చేరిన సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రధానంగా రైతులు, మహిళల శ్రేయస్సు కోసం ప్రకటించిన పథకాలు ఆ వర్గాలను అమితంగా ఆకట్టుకుంటున్నాయని, కాంగ్రెస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మి భారీగా కాంగ్రెస్ లో చేరికలు జరుగుతున్నాయని, నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.
Jadcherla: బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన మాజీ వార్డు సభ్యులు..
RELATED ARTICLES