అనన్య న్యూస్ జడ్చర్ల: ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో 1 లక్ష 36 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్యాకేజ్ -16 లో జరుగుతున్న సర్జిపూల్ ను (భూమి నుండి 92 మీటర్ల లోపలకి) పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ పనులను మంగళవారం ప్రాజెక్ట్ ఇంజనీర్లతో కలసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు తన హయాంలోనే ప్రారంభించి నేడు చివరి దశలో పూర్తి కావస్తున్న సందర్భంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడం ద్వారా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల పరిధిలో 12.30 లక్షల ఎకరాలకు నీళ్లు అందించడమే కాకా హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందిస్తుంది అని తెలిపారు. కార్యక్రమంలో ప్రాజెక్టు ఇంజనీర్లు, సిబ్బంది, నాయకులు తదితరులు ఉన్నారు.