- సీఎం సభ ప్రాంగణన్నీ పరిశీలించిన ఎమ్మెల్యే..
అనన్య న్యూస్, జడ్చర్ల: ఈనెల 18న జడ్చర్లలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించినునట్లు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. నవంబర్ 30న జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈనెల 18న జడ్చర్ల లో సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు, అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్లలో నిర్వహించే బారీ బహిరంగ సభ మొదటిది కానుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి జడ్చర్ల కల్వకుర్తి రోడ్ లో గల శివాలయం సమీపంలో ఉన్న స్థలంలో సభ ఏర్పాటు కొరకు స్థలాన్ని పరిశీలించారు. సీఎం హెలిప్యాడ్ పార్కింగ్ కొరకు కావలసిన స్థలాన్ని పట్టణ సిఐ రమేష్ బాబు తో చర్చించారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.