అనన్య న్యూస్, జడ్చర్ల: గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ కాలనీకి చెందిన బిజెపి నాయకులు నాగార్జునతో పాటు అతని సహచర మిత్రులు 20 మంది యువకులు బుధవారం జడ్చర్లలోని ఎమ్మెల్యే నివాసంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన నూతన సభ్యులకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హయాంలో గత తొమ్మిది ఏళ్లలో జడ్చర్ల పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని, సంక్షేమ పథకాలు పేదవారికి అందుతున్నాయని, బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ అభ్యున్నతికి పని చేయాలని సరైన సమయంలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్య చౌహన్, శశికిరణ్, ముడా డైరెక్టర్ శ్రీకాంత్, నాయకులు మురళి తదితరులు ఉన్నారు.