అనన్య న్యూస్, హైదరాబాద్: స్థానికేతరులు నియోజకవర్గాలను వదులు వెళ్లాలని, తెలంగాణ రాష్ట్రంలో సైలెంట్ పీరియడ్ మొదలైందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థులు రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని, ఎలాంటి ఎన్నికల మెటీరియల్‌ను ప్రదర్శించకోడదని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షనలో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. పోలింగ్ కు సర్వం సిద్ధం చేశామని అన్నారు. ఎన్నికల బరిలో 2,290 ఉన్నట్టు పేర్కొన్నారు. భద్రతా విధుల్లో 65 వేల మంది పోలీసులను ఉంచామని తెలిపారు. పోలీంగ్‌కు 48 గంటల ముందే 144 సెక్షన్ అమలు చేశామని అన్నారు. నవంబర్ 30వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజవర్గాలకు ఎన్నికల పోలీంగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీంగ్ జరగనుందని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
Hyd: స్థానికేతరులు నియోజకవర్గాలను వదిలి వెళ్లాలి: సీఈఓ వికాస్ రాజ్..
RELATED ARTICLES