అనన్య న్యూస్, హైదరాబాద్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్‌ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమాలో ఉన్న సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాజేంద్రనగర్‌లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీ.వై చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది. హైకోర్టు నిర్మాణం గురించి వారి మధ్య కాసేపు చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.
HYD: సీజేఐ జస్టిస్ డీ.వై చంద్రచూడ్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..
RELATED ARTICLES