అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రజాదర్బార్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ప్రజల నుంచి అర్జీలను సీఎం స్వీకరించారు. క్యూలైన్ లో ఉన్న ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి పరిశీలించారు. ప్రజా సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం నుంచి ప్రజాదర్బార్ ప్రారంభించనున్నట్లు గురువారం తన ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం ప్రకటించారు. దీంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభావన్ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెక్స్ లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకొని క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు. ప్రజా దర్బార్ కు మంచి స్పందన లభిస్తుంది రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమ సమస్యలను నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. ప్రజాదర్బార్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.