Friday, March 14, 2025

HYD: 6న తుక్కుగూడలో తెలంగాణ జన జాతర: సీఎం రేవంత్ రెడ్డి..

అనన్య న్యూస్, హైదరాబాద్: ఈనెల 6వ తేదీన తుక్కుగూడలో కాంగ్రెస్ తెలంగాణ జన జాతర బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే జన జాతర సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్​ రెడ్డి పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్​ పదేళ్ల విధ్వంసం పాలనను ప్రజలు మరువలేదన్నారు. ప్రతిపక్షం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.

జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​ పార్టీకి ఎంతో ప్రత్యేకమని, తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది సోనియాగాంధీ వల్లేనని పేర్కొన్నారు. ఈనెల 6న ఇక్కడే జాతీయ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు. జాతీయ మేనిఫెస్టో ప్రకటనకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఏఐసీసీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.

రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆరు గ్యారంటీలను తుక్కుగూడ సభలోనే ఇచ్చామని గుర్తు చేశారు. ఆరు హామీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేసి చూపించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు, సిలిండర్​, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ అమలు వంటివి ప్రవేశపెట్టామన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్​ పార్టీయేనని కొనియాడారు. మహిళా విభాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular