- రైతుబంధు ఆసరా విషయంలో క్లారిటీ ఇచ్చిన సీఎం..
- కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచన..
అనన్య న్యూస్, హైదరాబాద్: రైతుబంధు, ఆసరా పథకాలకు దరఖాస్తు చేసుకోవడంపై ఇప్పటివరకూ తలెత్తిన గందరగోళంపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే లబ్ది పొందుతున్న వారికి యథా విధిగా ఆ ఫలాలు అందుతాయని, కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజా పాలన కొన సాగుతున్న తీరుపై సచివాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో సీఎం రివ్యూ నిర్వహించారు.
ఆరు గ్యారంటీల్లో రైతుభరోసా (రైతు బంధు), చేయూత (ఆసరా పింఛన్లు) ఉన్నాయి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆ సాయం పెరుగుతుండడంతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా, లేక పాతవారిని అలాగే కంటిన్యూ చేస్తారా అన్న విషయంలో గందరగోళం నెలకొంది. అధికారులు సైతం సరైన వివరణ ఇవ్వలేక పోయారు. ఈ నేపథ్యంలో స్వయంగా సీఎంమే స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ది పొందుతూ ఉన్న వారికి యథావిధిగా కొత్త ప్రభుత్వంలో కొత్త పేర్లతో సాయం అందుతుందని, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడిం చారు.
కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకుంటే సరి పోతుందని క్లారిటీ ఇచ్చారు. పేదల అవసరాన్ని సొమ్ము చేసుకోడానికి ఎవరైన అప్లికేషన్లను అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. అప్లికేషన్ ఫామ్ లను అందుబాటులో ఉంచాలని అధి కారులను ఆదేశించారు. పాత పథకాల విషయంలో ఎలాంటి గంగరగోళానికి గురి కావొద్దన్నారు.