అనన్య న్యూస్, హైదరాబాద్: ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని, టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని, ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్స్ లకు నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ స్టాఫ్ నర్స్ ల నియామకం చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర అన్నారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
HYD: ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి..
RELATED ARTICLES