అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలి, మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జి ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా బీ గోపి నియామకం అయ్యారు. ఇంధన శాఖ కార్యదర్శిగా రిజ్వి, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా రిజ్వికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాన్స్‌కో సంయుక్త ఎండీగా సందీప్ కుమార్ ఝా, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కం సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి నియామకం అయ్యారు.