అనన్య న్యూస్, హైదరాబాద్: జీవో నెంబర్ 46 రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ముట్టడికి యత్నించారు. 50మంది కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం ఉదయం సచివాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో కానిస్టేబుల్ అభ్యర్థులు సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నివాదాలతో నిరసనకు దిగారు.
జీవో నంబర్ 46 రద్దు చేయాలని కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ, పాత పద్దతిలోనే నియామకాలను చేపట్టాలని, మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.