అనన్య న్యూస్, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఎంపీ అభ్యర్థిగా వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు నరేంద్ర మోడీ గంగమ్మకు పూజలు చేశారు. మోడీ సన్నిహితులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మరి కొంతమంది ప్రముఖుల సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వారణాసి నుంచి ఇప్పటివరకు రెండు సార్లు గెలిచిన మోడీ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. కార్యక్రమానికి బిజెపి పాలిత రాష్ట్రాల సమయంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, బిజెపి అగ్రనేత నడ్డ తరలివచ్చారు. ఏపీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. జూన్ 1న 7వ దశ ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ జరగనుంది. మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.