హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సోమవారం రైతులకు శుభవార్త వినిపించింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.