- రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి..
అనన్య న్యూస్, హైదరాబాద్: స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగమని, బానిసత్వాన్ని తెలంగాణ భరించ దని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వమన్నారు. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించబోమని పేర్కొన్నారు. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమా యకపు నెరజాణే కానీ… అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదని స్పష్టం చేశారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పరేడ్ లో గ్రౌండ్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తరిమికొడతాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణాలతోనే పాతిపెడతాం’ అన్న కవి కాళోజీ మాటలను ఆయన గుర్తు చేశారు. ఇది నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినమని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందన్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళి అర్పించారు. ఆరు దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధాన మంత్రి మన్మో హన్ సింగ్, నాటి యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రజలంద రికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం:
డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యాం ఇచ్చామని, ముళ్ల కంచెలు. ఇనుప గోడలు తొలగించి, పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామని ముఖ్యమంత్రి చెప్పారు. మున్సిపల్ కౌన్సిలర్ నుండి… ముఖ్య మంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చామన్నారు. తాము సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించామని చెప్పారు. సచివాలయంలోకి సామాన్యుడు కూడా రాగలిగే పరిస్థితి తెచ్చామని, ఇందిరాపా ర్కులో ధర్నాచౌక్ కు అనుమతి ఇచ్చామని, మీడియాకు స్వేచ్ఛను కల్పించామని, ప్రతిపక్షా నికి గౌరవం ఇచ్చామని తెలిపారు. తమ నిర్ణ యాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తు న్నామన్న ముఖ్యమంత్రి.. తప్పులు జరిగితే సరి దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తామే సర్వ జ్ఞానులం అన్న భ్రమలు లేవని, అందరి సలహాలను, సూచనలను స్వీకరించి, చర్చించి ముందుకు వెళుతున్నామని తెలిపారు.
జూన్ 2, 2014 నాడు తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరినా.. ఈ దశాబ్ద కాలంలో వందేళ్ల విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పదేళ్లలో తెలంగాణ మూల స్వభావమైన స్వేచ్ఛ పై దాడి జరిగిందని, సామాజిక న్యాయం మేడి పండు చందంగా మారిందని విమర్శించారు. ప్రజలంద రికీ చెందాల్సిన రాష్ట్ర సంపద గుప్పెడు మంది చేతుల్లోకి చేరిందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయని చెప్పారు. ఆర్థిక విధ్వంసంసంగతి చెప్పనక్కర్లేదన్నారు. అయితే ఇదంతా గతమని, ఇప్పుడు ప్రజలే, ప్రజల కోసం, ప్రజల చేత త ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఉందని ప్రకటించారు. ‘ఏ జాతి కైనా తన సంస్కృతే తన అస్తిత్వం. ఆ సంస్కృతిని కాపా డటం ప్రభుత్వాల బాధ్యత, బోనం నుండి బతుకమ్మ వరకు… సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర ఉద్యమం వరకు మన సంస్కృతి, మన చరిత్ర గొప్పవి. సమ్మక్క సార లమ్మ నుండి జోగులాంబ వరకు… భద్రాద్రి రాముడు నుండి కొమురం భీం వరకు, అమరుల త్యాగాలు, హక్కుల ఉద్యమాల వంటి వాటితో తెలంగాణ గొప్పచారి త్రక వారసత్వాన్ని కలిగి ఉంది. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలిని తెలిపారు.
సాంస్కృతిక పునరుజ్జీవానికి నిదర్శనం జయజ యహే తెలంగాణ గీతం:
తెలంగాణ వచ్చి పదేండైన ఇప్పటికీ మనకు రాష్ట్ర గీతం లేదు. ఉద్యమకాలంలో ఉవ్వెత్తున స్ఫూర్తిని రగిలించిన… సహజ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలం గాణ జననీ జయకేతనం..’ గేయమే మన రాష్ట్ర అధికార గీతం కావాలని ఆ నాడు ఆశించాం. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన ‘జయ జయహే తెలంగాణ…’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు’ అని సీఎం తెలిపారు.
ధిక్కారం, పోరాటం ప్రతిఫలించేలా చిహ్నం:
తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటమన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబిం బించాలని, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికా రిక ఉత్తర్వులు, సంస్థల సంక్షిప్త పేర్లు, వాహన రిజిస్ట్రేషన్ లో రాష్ట్రాన్ని సూచించే సంక్షిప్త అక్షరాలుగా టీజీ ఉండా లని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తెలం గాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపంగా ఉండాలని సీఎం అన్నారు. కష్టజీవి… కరుణామూర్తి రూపురేఖలతో తెలంగాణ తల్లి రూపానికి పునరుజ్జీవనం జరగాలని, త్వరలోనే తెలంగాణ తల్లి రూపం సిద్ధం అవు తుందని తెలిపారు.
విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ:
తాము అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై, 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో తెలంగాణ ఉందని రేవంత్రెడ్డి తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తూనే సంక్షేమం, అభివృద్ధిలో రాజీ పడటం లేదని. “ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షనర్లకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామని చెప్పారు. ‘మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి… ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం’ అని వివరించారు.
మూసీ సుందరీకరణ పథకంద్వారా పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ గా తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఈ పథకం మరోస్థాయికి తీసుకు వెళ్లుతుందనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నామని చెప్పారు. పాలన ప్రజల వద్దకు చేర్చాలన్నది ప్రభుత్వ ఆలోచన అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చిన 48 గంట ల్లోనే రెండు గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వివరించారు. తెలంగాణ ముందు పలు సవాళ్లు కూడా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్క తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఈ రోజుతోకాలం చెల్లింది. ఆంధ్రప్ర దేశ్ తో ఆస్తుల విభజనకు సంబంధించి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకుంటామన్నారు.
ప్రపంచానికి తెలంగాణ ఒక దిక్సూచి కావాలి:
తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగ రాలి. ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత… రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మన బ్రాండ్ ప్రపంచ నెంబర్ వన్ బ్రాండ్ గా హైదరాబాద్ ఎదగాలి. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్ గా మార్చాలన్న తపన ఉంది. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటు.. రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని.. ప్రజా ప్రభుత్వా నికి సంపూర్ణ సహకారం అందించాలని కోరారు.