అనన్య న్యూస్, హైదరాబాద్: తన ఫిర్యాదు పై జీహెచ్ఎంసీ అధికారులు స్పందించక పోవడంతో వారి కార్యాలయంలోకి ఓ యువకుడు పామును తెచ్చి వదిలాడు. ఈ ఘటన నగరంలోని బుధవారం అల్వాల్ లో చోటు చేసుకుంది. అల్వాల్ లో కురిసిన భారీ వర్షానికి సంపత్ కుమార్ అనే యువకుడు నివాస ముంటున్న ఇంట్లోకి వరద నీటితో పాటు పాము కూడ వచ్చింది. దీంతో ఆ యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
అయితే ఫిర్యాదు చేసి గంటలు గడుస్తున్న అధికారులు రాకపోవడంతో సదరు యువకుడు. పామును పట్టుకుని వెళ్లి అల్వాల్ జీహెచ్ఎంసీ వార్డు ఆఫీసులో వదిలి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో అక్కడున్న ఆఫీస్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.