అనన్య న్యూస్, హైదరాబాద్: పోస్టల్ డిపార్ట్ మెంట్ భారతదేశ ప్రజల ఒక భాగమైందని కేంద్ర కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక పోస్ట్ కార్డులను లాంచ్ చేయడం గర్వంగా ఉందని, తెలంగాణలోని బౌద్ధ సంపదపై పోస్టల్ డిపార్ట్ మెంటు ముద్రించిన ప్రత్యేక పోస్ట్ కార్టులతో కూడిన పోస్టల్ కవర్ ను కిషన్ రెడ్డి శుక్రవారం లాంచ్ చేశారు. బావపూర్ కుర్రు అనే గ్రామంలో ఉన్న 2వ శతాబ్దానికి చెందిన నాగముచిలింద బౌద్ధ స్తూపాన్ని గుర్తుచేసుకుంటూ ప్రత్యేక పోస్ట్ కార్డు ని రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ లోని సాంప్రదాయాన్ని తెలియజేసేలా 5 పోస్ట్ కార్డులని పోస్టల్ డిపార్ట్ మెంటు రిలీజ్ చేసిందని చెప్పారు. టెక్నాలజీ ఎంత పెరిగిన పోస్ట్ కార్డు కి ఉన్న ప్రత్యేకత వేరని పేర్కొన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కారణంగా రేడియో కి పూర్వ వైభవం వచ్చిందని, ఈ తరహాలోనే మోడీ ప్రధాని అయ్యాక పోస్టల్ డిపార్ట్ మెంట్ కు కొత్త కళ వచ్చిందన్నారు. పోస్ట్ ఆఫీస్ లను ఆధునీక రించడానికి ఒక్క తెలంగాణలోనే ఇప్పటివ రకు రూ.7వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని అన్నారు.