అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మేనిఫెస్టో కన్వీనర్ ప్రో. జానయ్య, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 5 న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రత్యేక హామీలను ప్రకటించింది.
HYD: తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు..
RELATED ARTICLES