అనన్య న్యూస్, హైదరాబాద్: లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. ఆదివారం అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు భక్తులకు ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. అమ్మవారిని ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు.
తెలంగాణ రాష్టం వచ్చిన తర్వాత బోనాల జాతర ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోనాలను ప్రభుత్వం అధికార పండుగుగా జరుపుతున్నదని వెల్లడించారు. దేవాలయలకు నిధులు ఇచ్చే ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా ఆలయ కమిటీ మంచి ఏర్పాట్లు చేసిందని చెప్పారు. అమ్మవారి దయ అందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా ఆశీస్సులు కలకాలం కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.