అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ ఛైర్మన్ గా పని చేస్తూ అకాల మరణం చెందిన సాయిచంద్ దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం కె. చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఆదివారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ సాయిచంద్ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పూలు చల్లి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిచంద్ తండ్రి వెంకట్ రాములును, భార్య రజిని మరియు కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ పరామర్శించారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాల్క సుమన్, సుధీర్ రెడ్డి, దానం నాగేందర్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అభిమానులు నివాళులర్పించారు.