Saturday, March 15, 2025

Group 1 Prelims: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు..

అనన్య న్యూస్, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న గ్రూప్-ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్ పిఎస్సి నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలో బయోమెట్రిక్ వివరాలు తీసుకోలేదని అనుమానం వ్యక్తం చేస్తూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. హాల్ టికెట్ నంబర్ లేకుండా ఓంఎఆర్ షీట్ ఇచ్చారని అభ్యర్థులు ఆరోపించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది.

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular