అనన్య న్యూస్, హైదరాబాద్: పది సంవత్సరాల కాలంలోనే యావద్దేశానికే తెలంగాణ దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ జెండాను సీఎం కేసీఆర్ ఎగురవేశారు. అనంతరం భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలు గుర్తు చేశారు. 2014లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన చర్యలను వివరించారు.
CM KCR: యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచి: సీఎం కేసీఆర్
RELATED ARTICLES