అనన్య న్యూస్: భారత అంతరిక్ష పరిశోదన సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 విజయవంతంగా అడుగు పెట్టింది. సుమారు 40 రోజులపాటు ప్రయాణించిన ల్యాండర్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా రోవర్ ప్రజ్ఞాన్ ను చంద్రుడిపై దింపింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండైన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. చంద్రుడిపై కాలుమోసిన నాలుగో దేశంగా భారత్ నిలించింది. ఇక మూన్ మిషన్ విజయవంతం కావడంతో భారత్ మరో ఖ్యాతి గడించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర భారత్ వేసింది. చంద్రయాన్ 3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు.
Chandrayan-3: విజయవంతంగా చంద్రుడిపై దిగిన రోవర్ ప్రజ్ఞాన్..
RELATED ARTICLES