- నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.
- రక్త బంధువులు గణేష్ యూత్ సేన సభ్యులు.
- స్వచ్ఛంద రక్తదానం యువత ఆదర్శం..
అనన్య న్యూస్: సాయం చేయడానికి ఏం కావాలి? మంచి మనసుండాలి.. మన కోసం చేసేది మనతోనే పోతుంది. ఆపన్నుల కోసం చేసేది శాశ్వతంగా నిలుస్తుంది. సేవాతత్పరులు ఆచరించే సూత్రమిదే.. ఎవరో ఒకరి పంచన చేరి మంచినీరడిగితేనే ఎగాదిగా చూసే మనుషులున్న రోజులివి.. అలాంటిది రక్తం అడగగానే దానం చేసేందుకు ముందుకొస్తున్నారు కొందరు దాతలు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ఊపిరిపోస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం.. ప్రాణార్థుల పాలిట పెన్నిధిగా నిలుస్తున్న దాతల ప్రతి రక్తపు బొట్టుకూ అనన్య న్యూస్ సలాం..
అన్నదానం మహాదానం.. ఒకప్పటి మాట! రక్తదానం మహా దానం ఇది నేటి మాట.!! గర్భిణులకు కాన్పు సమయంలో, ప్రమాదాల్లో క్షతగాత్రులకు రక్తం చాలా అవసరం. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవస్యకత, రక్తదానంపై అవగాహన కల్పించేందుకు ఏటా జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1901లో ఆస్ట్రేలి యాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ మొదటి సారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఆయన జయంతిని పురస్క రించుకుని 2004 నుంచి ఏటా రక్తదాన దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. రక్తంలో ఏ, బీ, ఏ పాజి టివ్, బీ పాజిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఓ గ్రూపు ఉన్నాయి. ఆరోగ్యవంతులైన వారు ప్రతి 3 నెలలకు ఒక సారి రక్తదానం చేయవచ్చు.
- రక్తదానం మహాదానం అంటూ ముందుకు సాగుతున్న గణేష్ యూత్ సేన ప్రత్యేక కథనం, ఫైల్ ఫొటోస్..
రక్త బంధువులు గణేష్ యూత్ సేన సభ్యులు:
ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాలు నిలబెడుతుందనే స్ఫూర్తితో జడ్చర్ల మున్సిపాలిటీ కి చెందిన గణేష్ యూత్ సేన సభ్యులు రక్తదాన శిబిరాల నిర్వహణ, రక్తదానాల్లో ముందంజలో ఉన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువకులు రక్తదానం చేయడంలో ఎంతో ముందంజలో ఉన్నారు. ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహించి తమ వంతు రక్తదానం చేస్తున్నారు. రక్తదానం ప్రాణదానంగా నిలుస్తుందని యువకులు పేర్కొంటున్నారు. కొంతమంది నీ ప్రాణదాతలుగా చేసేందుకు రక్తదానం అవసరం ఉంటుందని గణేష్ యూత్ సేన సభ్యులు అంటున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని అంటున్నారు.

