- ప్రధాని చేతుల మీదుగా అయోధ్య రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట..
అనన్య న్యూస్: అయోధ్యలో వైభవంగా శ్రీ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్యలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సోమవారం 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ స్వామి వారి విగ్రహం వద్ద తొలి పూజ చేశారు. ఆయన పాదాల వద్ద పూలను ఉంచి నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన వెంటనే రామ జన్మభూమిపై హెలికాప్టర్లతో పూలను చల్లారు. మరోవైపు శ్రీరాముడి ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా టీవీల ద్వారా వీక్షించారు. ఒక అద్భుతమైన, అపూర్వమైన ఘట్టాన్ని వీక్షించిన ప్రజలంతా ఒక అనీర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. యావత్ దేశం శ్రీరామ నామ స్మరణతో మారుమోగింది.