అనన్య న్యూస్, అచ్చంపేట: కొడంగల్‌కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ దమ్ము ఏంటో ఇండియా అంతా చూసింది. మీరంతా కేసీఆర్ దమ్ము ప్రజలను ఉద్దేశించి ఈ దమ్ము గట్టిగా బయలెల్లుతే దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్ 30న దుమ్ము రేగాలి. గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదో ఏడాదిలో మళ్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. విషయం మొత్తం మీకు తెలుసు. ఎలక్షన్‌లో ఏం జరుగుతదో కూడా మీకు తెలుసు.
ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి.. ఎన్నికల్లో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి.. అప్పుడే బతుకులు బాగుపడుతాయి అని కేసీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో ఇవాళ మాట్లాడే సిపాయిలు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఊరు, వాడ పక్షిలాగా తిరిగి యావత్ తెలంగాణను ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయాం. డిండి మీద నుంచి వచ్చాను. చాలా దూరం దుందుభి నది కనబడుతుంది. చెక్ డ్యాంలు కనబడుతున్నాయి. దుమ్ము లేసిపోయిన దుందుభిలో నీళ్లు కనబడుతున్నాయి అని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. వారి మాటలు వినొద్దు. నేను చెప్పే మాటలను వినండి.. ఆలోచించండి. ఒకప్పుడు నేను పోరాటం చేశాను. ఇప్పుడు మీరు పోరాటం చేయాలి. తెలంగాణ కోసం నేను బయల్దేరినప్పుడు ఎవరికీ నమ్మకం లేదు. పిడికెడు మందిని పెట్టుకుని, పోరాటం చేశాం. నిజాయితీగా, దమ్ము, ధైర్యంతో ముందుకెళ్తే.. విధిలేక తెలంగాణను ఇచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
ఇక రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగుతారని కేసీఆర్ అన్నారు. వారి రాష్ట్రాల్లో మంచినీళ్లు, కరెంట్ ఇవ్వలేనోళ్లు వచ్చి ఉపన్యాసాలు చెబుతారు. కానీ కేసీఆర్ దేశానికి ఒక మార్గదర్శనం చూపించారు. ఇండియాలో ఒక్కటే ఒక్క స్టేట్.. ఇంటింటికీ మంచినీళ్లు ఇచ్చేది మనమే. కేసీఆర్ దమ్ము సంగతి ఇండియా అంతా చూసింది. మీరంతా కేసీఆర్ దమ్ము.. ఈ దమ్ము గట్టిగా బయల్లెలుతే దుమ్ము దుమ్ము లేస్తది. లెవ్వాలి. నవంబర్ 30న దుమ్ము రేగాలి. బ్రహ్మాండమైన మెజార్టీతో బాలరాజు గెలిచి రావాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.