అనన్య న్యూస్, మిడ్జిల్: మరిన్ని నిధులు తీసుకొచ్చి మిడ్జిల్ మండలాన్ని అభివృద్ధి చేస్తానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిల్ రెడ్డి అన్నారు. శనివారం మిడ్జిల్ మండలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బోయిన్ పల్లి గ్రామ రైతులకు 24 గంటల కరెంటు ఉండాలనే ఉద్దేశంతో 3 కోట్ల 50 లక్షలతో నూతన సబ్ స్టేషన్ ను మంజూరు చేయించామని అన్నారు. ఈ సబ్ స్టేషన్ వలన గ్రామంలోని 1020 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు మండలంలో ఈనాటి వరకు 4739 మంది లబ్ధిదారుల మొత్తంగా 71 లక్షలు బిల్లును ప్రభుత్వం కట్టిందన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో 200 ఇది ఇట్లా ఉచిత కరెంటు ఇప్పటివరకు 54,328 మంది లబ్ధిదారుల మొత్తంగా 8.65 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు.
రైతు రుణమాఫీ జడ్చర్ల నియోజకవర్గంలోని 31,544 మందికి మొత్తంగా 259 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. మిడ్జిల్ నుండి కొత్తపల్లి వరకు డబుల్ లైన్ రోడ్డు దాదాపు 33 కోట్లతో సాంక్షన్ అయ్యిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాజీ ఎమ్మెల్యే మొత్తంగా రోడ్ల నిమిత్తం పదేళ్లలో 93 కోట్లు తీసుకొస్తే, నేను మొదటి సంవత్సరంలోనే 153 కోట్లు తీసుకొచ్చానని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం సన్న వడ్ల కు 500 రూపాయల రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తుందని అన్నారు. ఈ విధంగా మొదటి సంవత్సరంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వచ్చే మార్చి నెలలో మిడ్జిల్ మండలానికి మరిన్ని నిధులను తీసుకొచ్చి మండల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.