అనన్య న్యూస్, మహబూబ్ నగర్: తెలంగాణలో మరోసారి భూకంపం వచ్చింది. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూప్రకంపనలు రావడంతో ఇళ్లలోంచి జనాలు బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.0గా నమోదు అయింది.
మూడురోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు జనాన్ని భయపెట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకన్ల పాటు షాక్ లో ఉండిపోయారు. అయితే ములుగు జిల్లా మేడారంలో భూకంపకేంద్రం ఏర్పడగా దాని ఎఫెక్ట్ 230 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు విస్తరించింది.