అనన్య న్యూస్, హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం రేషన్‌కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని చెప్పారు. కొత్తగా రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇస్తామని తెలిపారు.