అనన్య న్యూస్, మహబూబ్ నగర్: సామాజిక సేవలో పాలమూరు రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలంగాణా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రాష్ట్ర రెడ్ క్రాస్ చైర్మన్, విశ్రాంత ఐఎఎస్ అధికారి అజయ్ మిశ్రా, గవర్నర్ కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం లతో కలిసి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి. రమణయ్య లు బుధవారం హైదరాబాద్ రాజ్ భవన్ లో ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం, జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకొని అభినందించారు. సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించి పేదలకు చేరువ కావాలన్నారు.
Red Cross Mbnr: పాలమూరు రెడ్ క్రాస్ సేవలు భేష్: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..
RELATED ARTICLES