అనన్య న్యూస్, హైదరాబాద్: ఈనెల 26న రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఓ ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయి చరణ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో తల్లి దండ్రులతో కలిసి సాయి చరణ్ సీఎంను కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం పుష్పగుచ్చం అందించి అభినందించారు. సాయి చరణ్ కు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
HYD: సాయి చరణ్ ధైర్య సాహసాన్ని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..
RELATED ARTICLES