అనన్య న్యూస్, హైదరాబాద్: అట్టడుగు వర్గాలతో పాటు మహిళా సాధికారతకై కృషి చేసిన మహనీయుడు డా. బి.ఆర్ అంబేద్కర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం ఆయన ముందుచూపుతో రాజ్యాంగాన్ని రచించి భావి తరాలకు మంచి మార్గాన్ని చూపారని, అందరికీ ఆయన స్ఫూర్తే ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన రచించిన రాజ్యాంగమే రాష్ట్రానికి జీవం పోసిందని గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై కృషి చేస్తుందని అన్నారు. సీఎం వెంట సీఎం సలహాదారు వెం నరేందర్ రెడ్డి, దానం నాగేందర్, విజయారెడ్డి ఉన్నారు.
HYD: సాధికారతకై కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్: సీఎం రేవంత్ రెడ్డి..
RELATED ARTICLES