అనన్య న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఆయన నివాసంలో కుమార్తె నైమిషా రెడ్డి కుమారుడు రేయాన్ష్ తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్ష్ చిరునవ్వులు చిందించాడు.